చిరుతపులితో భగవాన్

Sunday, May 24, 2009
భగవాన్ పచ్చయ్యమ్మ కోయిలలో వుంటూ వుండే రోజుల్లో, ఓ రోజు మద్రాసునుంచి వారి భక్తులు రంగస్వామి అయ్యంగారు వొచ్చారు. మధ్యాన్నం వొంటిగంటకి మండుటెండలో, ఆలయం ఎదురుగా వుండే కొలనులో స్నానానికి వెళ్ళారు. అదంతా అడవి. ఎవరూ లేరు. హాయిగా స్నానం చేస్తున్నారు అయ్యంగారు.

భక్తులతో మాత్లాడుతో వున్న భగవాన్ చప్పున లేచారు.
అక్కడికొక చిరుత పులి వొస్తోంది, దాహం తీర్చుకోవడానికి.
అయ్యంగారు ఇవతల వొడ్డున స్నానం చేస్తున్నారు. చిరుతని చూడలేదు.

'ఇపుడు పోయి కొంచెం ఆగి తరువాత రా,
నిన్ను చూసి అయ్యంగారు భయపదతారు ' అన్నారు భగవాన్.
చిరుతపులి వెళ్ళిపోయింది.

1 comments:

AMMA ODI said...

అవునండి. భగవాన్ రమణ మహర్షి కి మనుష్యులలో జంతు ప్రవృత్తి ఉంటే, ఆ మనిషి ఆ జంతువు రూపంలోనే కనిపిస్తాడని అంటారు. జంతువులలోని సాత్విక ప్రవృత్తి ఆయనకీ తెలిసేది కాబోలు.