Thursday, March 31, 2022

 

|| వెంకట్రామన్ ||

1879 - డిశంబరు 30వ రాత్రి ఒంటిగంట వేళ, అంటే ప్రమాది సంవత్సర, మార్గశీర్షమాస, పునర్వసు నక్షత్రమందు అలఘమ్మ గర్భాన ఒక మగశిశువు జన్మించాడు. 
అది ఆరుద్రా నక్షత్ర దర్శన పుణ్యదినం. 
పరమేశ్వరుడు, బ్రహ్మ - విష్ణువులకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన పర్వదినమిది. 
ఆ రోజున పరమేశ్వరుడు కరుణాస్వరూపుడై - గౌతమ, పతంజలి, వ్యాఘ్ర పాదాది మొదలైన మహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనమిచ్చిన పుణ్యదినం. 

ఆ శుభసమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఆనందతాండవమూత్రిని మహావైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజున తిరుచ్చిళిలో ఈశ్వరోత్సవం ముగిసి, స్వామి గర్భాలయం ప్రవేశించేప్పుడు, అలఘమ్మ ప్రసవించింది.

ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు నాగస్వామి. 
వారిది తెలుగు సంప్రదాయం. పూర్వం ఆ వంశంలో తెలుగు విద్వాంసులు వుండేవారు. 
వారు తండ్రిని 'నాయనా' అని పిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి కావడం చేత, ఆ బిడ్డకు 'వెంకట్రామన్ '  అని పేరు పెట్టారు. 

ఆ తర్వాత ఆ దంపతులక్కు 'నాగసుందరం' అనే కొడుకూ, 'అలిమేలు '  అనే కూతురూ కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరిమాదిరిగా పెరిగినా అతనిలో చురుకుదనంతక్కువ, 
నిద్ర ఎక్కువగా ఉండేది, అయినా అతడు పిల్లలతో కలిసి భూమినాధేశ్వరస్వామి ఆలయం ప్రక్కన వున కఖ్ళ్యాణమండపంలోనో, కౌండిన్యనదీతీరమొలోనో ఆటలాడుకునేవాడు. 
అతనికి ఎనిదిదవ ఏట, శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు.

II

సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండక చేసుకుని, 
ఆ రాత్రి వెంకట్రామన్ ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికి వెళ్లారు. 
వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి, 
వెంకట్రామన్ ఇంటి తలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు. 
వాళ్లు ఎంత అరచి, పిలిచి, తలుపులు బాదినా, అతనికి మెలకువ రాలేదు. 
చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా, అతనికి మెలకువ రాలేదు.

వెంకట్రామ న్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. అతనితో ఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్ర పోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా, 
అతని ముఖానికి మసి పూసేవారు, ఏం చేసినా, అతనికి మెలకువ వచ్చేది కాదు.
'ఆ రకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది '  
అని చెప్పేవారు భగవాన్.
Tuesday, March 29, 2022

  || అక్షర మణమాల ||



పెరుమాళ్ళస్వామి, 

స్వామి సేవ చేసుకుంటో ఊళ్ళో ఓ సత్రంలో భోజనం చేసేవారు. 

కొన్నాళ్ళకు ఆ సత్రంవారికి ఆయన పద్దతి నచ్చలేదు.


అప్పుడు పెరుమాళ్ళస్వామి, భగవాన్ తో      

'భిక్షుక వృత్తి స్వీకరించి, భిక్ష ఎత్తుకుంటూ ఊరంతా తిరుగుతాను. 

ఆ సమయంలో పాడుకునేందుకు నాకో పాట రాసి ఇవ్వండి ' అని స్వామిని అర్థించారు. 

తత్ఫలితంగా 'అరుణాచలశివ, అరుణాచలశివ, 

అరుణాచలశివ, అరుణాచలా!' అనే పల్లవితో స్వామి పాట కట్టారు. 


అదే 'అక్షర మణమాల ' . 

|| చిన్నస్వామి ||








1916 చివరలో, స్వామి స్కందాశ్రమానికి మకాం మార్చారు. 
అందరితో పాటు అలఘమ్మ కూడా అక్కడకు చేరింది. స్వామితో స్థిరపడింది. 
అక్కడ ఆమె వంట చేసేది. ఓ స్థిరనివాసం, వంటా అన్నీ ఏర్పాటుకావడంతో, కొత్తవారు వచ్చి స్వామితో స్థిరపడ్డారు. వారూ తలొక పనీ చేసేవారు. 

స్వామి కూడా వంటలో సహాయం చేసేవారు. కొందరు గోడలు, అరుగులు కట్టారు. 
'ఆ అరుగులు ఎంతో సుఖంగా వుండేవి ' అన్నారు భగవాన్ ఒకసారి శ్రీరమణాశ్రమంలో.

ఆ అరుగులపై గడ్డిచాపలు పరచుకుని కూర్చునేవారు. 
స్కందాశ్రమం ఋష్యాశ్రమాల్ని గుర్తు చేసేది. 
నిరంతరం ప్రవహించే ఆ సెలయేరు ఆశ్రమవాసుల అవసరాలు తీర్చడమేకాక, 
తోటలో మొక్కలకు కూడా నీటిని ఇచ్చేది. 
అక్కడ కొత్త జీవివం ఆరంభమైంది.

స్కందాశ్రమం ఏర్పడిన ఆరు మాసాలకు అలఘమ్మ నారాయణ రెడ్డి 
అనే అతన్ని పంపించి మూడో కొడుకు నాగసుందరాన్ని అరుణాచలం రప్పించింది. 
మొదట్లో అతడు గంభీరం శేషయ్యగారి ఇంట్లో వుండేవాడు. 
తర్వాత ఓ సత్రంలో తింటో, తిరిగేవాడు. 
క్రమంగా అతనిలో మార్పు వచ్చింది. 

1918 లో అతడు కాషాయం కట్టి నిరంజనానంద స్వామి అని పేరు మార్చుకున్నాడు. 
భిక్షాన్నంతో జీవించేవాడు. అది చూసి 'ఇక్కడ అలఘమ్మ వంటచేసి పెడితే 
ఇంతమంది తినగా లేనిది, కన్నకొడుకు భిక్షాటన చేసుకుని తినడం ఎందుకు?' 
అని కొందరు అతన్ని స్కందాశ్రమానికి తీసుకొచ్చారు. 

అప్పటి నుంచి అతన్ని అందరూ 'చిన్నస్వామి ' అని పిలిచేవారు.
Monday, March 28, 2022

 || మౌనం ||

వెంకట్రామన్ మాట్లాడకపోతే, స్వామి మౌనవ్రతం పూనారకున్నారు. 
కాని, అసలేం జరిగిందంటే, అంటూ భగవాన్ ఒకసారి ఇట్లా చెప్పారు 

'నేను అరుణాచలేశ్వరాలయంలో వేయి కాళ్ళ మండపంలో ఉన్నప్పుడు, 
ఒక సాధు పక్కన కూర్చున్నాను. ఆయన నాకు భిక్షాన్నం పెట్టేవారు. గుంపుల నుంచీ, వారి ప్రశ్నలనుంచీ తప్పించుకునేందుకు ఆ సాధు మౌనవ్రతం పూనారు. 

ఆ పద్దతి తాత్కాలిక అనుకూల పద్దతిగా తోచి, నేనూ ఆ పద్దతినే అనుకరించాను. 
అంతేకాని నేను మౌనవ్రతం పూనలేదు యేనాడూ. ఊరికే మౌనంగా వుండేవాడిని. అవసరమైనప్పుడు మాట్లాడేవాడిని '.

మౌనం నిరంతర భాషణ. 
ఆలోచనలు ఆగిన తర్వాత పరస్పర అవగాహన చేసుకోడానికి పనికివచ్చే భాష. 
మౌనం, అది విశ్వజనీనమైన భాష. అది ఆగని వాక్ప్రవాహం. 
మాటలు దానికి అడ్డు కట్టలు. వాక్కులు, అవాంతరాలు. మౌనం, శక్తివంతమైన భాష. 
అంతులేని జనన - మరణాలకు అంతం, మౌనం. అటువంటి మౌనం, మూత్రివంతమైనదే వెంకట్రామన్. అంటే అతనే మౌనం. 

అటువంటి మహర్షి, మౌన బోధ చేస్తారనేది ఉత్త అర్థం లేని సంగతి.
మౌనమంటే, మాట్లడకపోవడం కాదు. 
మనోవృత్తుల విజృంభణల్ని ఆపుజేయడం. మౌనం, ప్రపంచాన్ని నిరాకరించదు. 

కాని, ప్రపంచాన్ని గ్రహిస్తుంది, సహిస్తుంది, భరిస్తుంది, అనుభవిస్తుంది. 
ఆ మౌనమే, సత్యం-శివం-సుందరం. 
అదే ఆనందం, శాంతం. అదే ఆత్మం. అదే మోక్షం.
|| సమాధి స్థితి || 

సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండక చేసుకుని, ఆ రాత్రి వెంకట్రామన్ ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికి వెళ్లారు. వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి, వెంకట్రామన్ ఇంటి తలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు. వాళ్లు ఎంత అరచి, పిలిచి, తలుపులు బాదినా,
 అతనికి మెలకువ రాలేదు. చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా, 
అతనికి మెలకువ రాలేదు.

వెంకట్రామన్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. 
అతనితో ఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్ర పోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా, అతని ముఖానికి మసి పూసేవారు, ఏం చేసినా,
అతనికి మెలకువ వచ్చేది కాదు.

'ఆ రకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. 
అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది '  అని చెప్పేవారు భగవాన్.

 

భగవాన్ మాత అలఘమ్మ వేడుకోలు | ప్రారబ్ధం |




1898 - క్రిస్మస్ శలవలకు భగవాన్ అన్నగారైన నాగస్వామిని తీసుకుని అలఘమ్మ(మాత) తిరువణ్ణామలై వచ్చింది. వెంకట్రామన్(భగవాన్) గురించి చెప్పినప్పటి నుంచీ ఆమె క్షణం ఒక యుగంగా గడిపింది.

అలఘమ్మ యెంత పలకరించినా భగవాన్ మౌనంగా వుండిపోయినారు.
యెంతో యేడ్చింది.

'బాబూ, వెంకట్రామన్ ఒక్కసారి నా వైపు చూడరా! నేను నీ తల్లినిరా. యెంత మారిపోయావురా. ఎంత చిక్కిపోయావో! అన్నయ్య కూడా వచ్చాడురా ' అని ఒకటే బ్రతిమాలింది.

అలఘమ్మ దీనావస్థ చూసి కొందరు జాలిపడి, 'స్వామీ, మీ అమ్మ వచ్చారు ' అన్నారు. 

స్వామి మౌనంగానే వున్నారు. అలఘమ్మ అభ్యర్థన, రోదన, ప్రాధేయపడటం చూసి, 

కొందరు జాలిపడి, 'స్వామీ, మీ తల్లి ఏడుస్తోంది. ఆమెకు ఓదార్పుగానైనా, కనీసం ఒక్క మాటైనా ఆమెతో మాట్లాడండి, స్వామీ ఆమెను దయ తలచండి. పోనీ, 'అవును-కాదు ' అని అయినా అనండి ' అని వినయపూర్వకంగా విన్నవించారు, 

స్వావి సమాధానం చెప్పకపోయేటప్పటికి,

'ఆమె తృప్తికోసం ఏదో ఒకటి కాగితం మీద రాయండి ' అని పచ్చయప్ప పిళ్లై స్వామిని అడిగారు.

స్వామి కాగితం, పెన్సిల్ తీసుకుని, 'వారి, వారి ప్రారబ్ద కర్మానుసారం, విధాత వారి విధి నిర్ణయిస్తాడు. జరుగవలసింది, ఎవరెంత అడ్డు పెట్టినా, జరిగే తీరుతుంది - జరగనిది, ఎవరెంత ప్రయత్నించినా జరగదు. ఇతి సత్యం, కనుక, వూరికే వుండటం మంచిది, ' అని రాశారు.

అదే స్వామి ప్రపంచానికి ఇచ్చిన ప్రథమోపదేశం. ప్రారబ్ద కర్మానుసారం, కర్మ ఫలితాన్ని అనుభవించవలసిన బాధ్యత, కర్తది కాని, భవంతుడిది కాదు '  అన్నారు ఒకసారి స్వామి, శివప్రకాశం పిళ్లై ప్రశ్నకు సమాధానంగా.


 || భిక్ష ||



బ్రాహ్మణస్వామిగా భిక్షాటనకు వెళ్లిన రోజుల గురించి ఒకసారి మాటల్లో భగవాన్ ఇట్లా చెప్పారు .

'నేను భిక్ష ఎత్తే రోజుల్లో, లోకానికి చక్రవర్తిననిపించేది. 
చేతిలో ఒక మట్టి మూకుడైనా వుండేది కాదు. 
ఎవరి ఇంటి ముందు అయినా ఆగి, చప్పట్లు చరిచేవాడిని. 
వారు ఏదైనా పెడితే, దోసిలిపట్టి, 
అక్కడే తిని చేతులు తలకు తుడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. 
ఒకే ఇంటికి రెండుసార్లు వెళ్ళేవాడిని కాదు. 
తిరువణ్ణామలైలో నేను తిరగని వీధంటూ లేదు. 

నేను ఎప్పుడు భిక్షకు వస్తానా అని కొందరు నా కోసం ఎదురు చూసేవారు. 
కొందరు ఏమన్నా మిగిలితే పెట్టేవారు. 
కొందరు 'నీ కేరా, బలిసి దుక్కలా వున్నావు. ఫో! కూలి పని చేసుకో!' అని కసిరేవారు. 

నేను నవ్వుకుంటో వెళ్లిపోయేవాడిని.

Blessing

Blessing
Bhagavan Memories