|| సమాధి స్థితి ||
సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండక చేసుకుని, ఆ రాత్రి వెంకట్రామన్ ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికి వెళ్లారు. వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి, వెంకట్రామన్ ఇంటి తలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు. వాళ్లు ఎంత అరచి, పిలిచి, తలుపులు బాదినా,
అతనికి మెలకువ రాలేదు. చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా,
అతనికి మెలకువ రాలేదు.
వెంకట్రామన్ నిద్రావస్థ చాలా చిత్రమైనది.
అతనితో ఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్ర పోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా, అతని ముఖానికి మసి పూసేవారు, ఏం చేసినా,
అతనికి మెలకువ వచ్చేది కాదు.
'ఆ రకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం.
అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది ' అని చెప్పేవారు భగవాన్.
0 comments:
Post a Comment