Showing posts with label అలఘమ్మ. Show all posts
Showing posts with label అలఘమ్మ. Show all posts
Thursday, March 31, 2022

 

|| వెంకట్రామన్ ||

1879 - డిశంబరు 30వ రాత్రి ఒంటిగంట వేళ, అంటే ప్రమాది సంవత్సర, మార్గశీర్షమాస, పునర్వసు నక్షత్రమందు అలఘమ్మ గర్భాన ఒక మగశిశువు జన్మించాడు. 
అది ఆరుద్రా నక్షత్ర దర్శన పుణ్యదినం. 
పరమేశ్వరుడు, బ్రహ్మ - విష్ణువులకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన పర్వదినమిది. 
ఆ రోజున పరమేశ్వరుడు కరుణాస్వరూపుడై - గౌతమ, పతంజలి, వ్యాఘ్ర పాదాది మొదలైన మహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనమిచ్చిన పుణ్యదినం. 

ఆ శుభసమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఆనందతాండవమూత్రిని మహావైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజున తిరుచ్చిళిలో ఈశ్వరోత్సవం ముగిసి, స్వామి గర్భాలయం ప్రవేశించేప్పుడు, అలఘమ్మ ప్రసవించింది.

ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు నాగస్వామి. 
వారిది తెలుగు సంప్రదాయం. పూర్వం ఆ వంశంలో తెలుగు విద్వాంసులు వుండేవారు. 
వారు తండ్రిని 'నాయనా' అని పిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి కావడం చేత, ఆ బిడ్డకు 'వెంకట్రామన్ '  అని పేరు పెట్టారు. 

ఆ తర్వాత ఆ దంపతులక్కు 'నాగసుందరం' అనే కొడుకూ, 'అలిమేలు '  అనే కూతురూ కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరిమాదిరిగా పెరిగినా అతనిలో చురుకుదనంతక్కువ, 
నిద్ర ఎక్కువగా ఉండేది, అయినా అతడు పిల్లలతో కలిసి భూమినాధేశ్వరస్వామి ఆలయం ప్రక్కన వున కఖ్ళ్యాణమండపంలోనో, కౌండిన్యనదీతీరమొలోనో ఆటలాడుకునేవాడు. 
అతనికి ఎనిదిదవ ఏట, శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు.

II

సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండక చేసుకుని, 
ఆ రాత్రి వెంకట్రామన్ ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికి వెళ్లారు. 
వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి, 
వెంకట్రామన్ ఇంటి తలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు. 
వాళ్లు ఎంత అరచి, పిలిచి, తలుపులు బాదినా, అతనికి మెలకువ రాలేదు. 
చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా, అతనికి మెలకువ రాలేదు.

వెంకట్రామ న్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. అతనితో ఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్ర పోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా, 
అతని ముఖానికి మసి పూసేవారు, ఏం చేసినా, అతనికి మెలకువ వచ్చేది కాదు.
'ఆ రకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది '  
అని చెప్పేవారు భగవాన్.
Monday, March 28, 2022

 

భగవాన్ మాత అలఘమ్మ వేడుకోలు | ప్రారబ్ధం |




1898 - క్రిస్మస్ శలవలకు భగవాన్ అన్నగారైన నాగస్వామిని తీసుకుని అలఘమ్మ(మాత) తిరువణ్ణామలై వచ్చింది. వెంకట్రామన్(భగవాన్) గురించి చెప్పినప్పటి నుంచీ ఆమె క్షణం ఒక యుగంగా గడిపింది.

అలఘమ్మ యెంత పలకరించినా భగవాన్ మౌనంగా వుండిపోయినారు.
యెంతో యేడ్చింది.

'బాబూ, వెంకట్రామన్ ఒక్కసారి నా వైపు చూడరా! నేను నీ తల్లినిరా. యెంత మారిపోయావురా. ఎంత చిక్కిపోయావో! అన్నయ్య కూడా వచ్చాడురా ' అని ఒకటే బ్రతిమాలింది.

అలఘమ్మ దీనావస్థ చూసి కొందరు జాలిపడి, 'స్వామీ, మీ అమ్మ వచ్చారు ' అన్నారు. 

స్వామి మౌనంగానే వున్నారు. అలఘమ్మ అభ్యర్థన, రోదన, ప్రాధేయపడటం చూసి, 

కొందరు జాలిపడి, 'స్వామీ, మీ తల్లి ఏడుస్తోంది. ఆమెకు ఓదార్పుగానైనా, కనీసం ఒక్క మాటైనా ఆమెతో మాట్లాడండి, స్వామీ ఆమెను దయ తలచండి. పోనీ, 'అవును-కాదు ' అని అయినా అనండి ' అని వినయపూర్వకంగా విన్నవించారు, 

స్వావి సమాధానం చెప్పకపోయేటప్పటికి,

'ఆమె తృప్తికోసం ఏదో ఒకటి కాగితం మీద రాయండి ' అని పచ్చయప్ప పిళ్లై స్వామిని అడిగారు.

స్వామి కాగితం, పెన్సిల్ తీసుకుని, 'వారి, వారి ప్రారబ్ద కర్మానుసారం, విధాత వారి విధి నిర్ణయిస్తాడు. జరుగవలసింది, ఎవరెంత అడ్డు పెట్టినా, జరిగే తీరుతుంది - జరగనిది, ఎవరెంత ప్రయత్నించినా జరగదు. ఇతి సత్యం, కనుక, వూరికే వుండటం మంచిది, ' అని రాశారు.

అదే స్వామి ప్రపంచానికి ఇచ్చిన ప్రథమోపదేశం. ప్రారబ్ద కర్మానుసారం, కర్మ ఫలితాన్ని అనుభవించవలసిన బాధ్యత, కర్తది కాని, భవంతుడిది కాదు '  అన్నారు ఒకసారి స్వామి, శివప్రకాశం పిళ్లై ప్రశ్నకు సమాధానంగా.


Blessing

Blessing
Bhagavan Memories