Monday, March 28, 2022

 || మౌనం ||

వెంకట్రామన్ మాట్లాడకపోతే, స్వామి మౌనవ్రతం పూనారకున్నారు. 
కాని, అసలేం జరిగిందంటే, అంటూ భగవాన్ ఒకసారి ఇట్లా చెప్పారు 

'నేను అరుణాచలేశ్వరాలయంలో వేయి కాళ్ళ మండపంలో ఉన్నప్పుడు, 
ఒక సాధు పక్కన కూర్చున్నాను. ఆయన నాకు భిక్షాన్నం పెట్టేవారు. గుంపుల నుంచీ, వారి ప్రశ్నలనుంచీ తప్పించుకునేందుకు ఆ సాధు మౌనవ్రతం పూనారు. 

ఆ పద్దతి తాత్కాలిక అనుకూల పద్దతిగా తోచి, నేనూ ఆ పద్దతినే అనుకరించాను. 
అంతేకాని నేను మౌనవ్రతం పూనలేదు యేనాడూ. ఊరికే మౌనంగా వుండేవాడిని. అవసరమైనప్పుడు మాట్లాడేవాడిని '.

మౌనం నిరంతర భాషణ. 
ఆలోచనలు ఆగిన తర్వాత పరస్పర అవగాహన చేసుకోడానికి పనికివచ్చే భాష. 
మౌనం, అది విశ్వజనీనమైన భాష. అది ఆగని వాక్ప్రవాహం. 
మాటలు దానికి అడ్డు కట్టలు. వాక్కులు, అవాంతరాలు. మౌనం, శక్తివంతమైన భాష. 
అంతులేని జనన - మరణాలకు అంతం, మౌనం. అటువంటి మౌనం, మూత్రివంతమైనదే వెంకట్రామన్. అంటే అతనే మౌనం. 

అటువంటి మహర్షి, మౌన బోధ చేస్తారనేది ఉత్త అర్థం లేని సంగతి.
మౌనమంటే, మాట్లడకపోవడం కాదు. 
మనోవృత్తుల విజృంభణల్ని ఆపుజేయడం. మౌనం, ప్రపంచాన్ని నిరాకరించదు. 

కాని, ప్రపంచాన్ని గ్రహిస్తుంది, సహిస్తుంది, భరిస్తుంది, అనుభవిస్తుంది. 
ఆ మౌనమే, సత్యం-శివం-సుందరం. 
అదే ఆనందం, శాంతం. అదే ఆత్మం. అదే మోక్షం.

0 comments:

Blessing

Blessing
Bhagavan Memories